బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్న విజయ భాస్కర్, త్రివిక్రమ్

ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం వచ్చిందని, అయితే ఆ సమయంలో సరైన కథ అందుబాటులో లేకపోవడంతో ఆ కల నెరవేరలేకపోయిందని విజయ్ భాస్కర్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. బాలకృష్ణ తోడల్లుడు, నిర్మాత ఎం.ఆర్.వి. ప్రసాద్ స్వయంగా ఫోన్ చేసి సినిమా చేయమని కోరినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ‘మల్లీశ్వరి’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కారణంగా, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా మాస్ కామెడీ కథ సిద్ధంగా లేక చేయలేకపోయామని చెప్పారు.

బాలకృష్ణ మాస్ హీరోగా ఉన్నప్పటికీ, ఆయన వినోదం, పాటలు తనను ఆకర్షించాయని, ఆయనతో ఒక గొప్ప మాస్ కామెడీ సినిమా చేయాలని తాను అనుకున్నానని విజయ్ భాస్కర్ తెలిపారు. గతంలో తాను బి. గోపాల్ దగ్గర ‘లారీ డ్రైవర్’ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు బాలకృష్ణ తనతో చాలా సరదాగా మాట్లాడేవారని, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చూసి ఆయనకు ఎంత నచ్చిందో చెప్పానని గుర్తు చేసుకున్నారు.

సరైన కథ లేకపోవడంతో ఆ సమయంలో బాలకృష్ణతో సినిమా చేయాలన్న అవకాశం వృథా అయిందని, ఆ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోయిందని విజయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్‌కి తగ్గట్లుగా సినిమా చేయాలని అనుకున్నా, డేట్స్ వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో సినిమా చేయలేకపోయామన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు