టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్కు మొదట ‘ఫౌజి’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల దర్శకుడు హను రాఘవపూడి చేసిన వ్యాఖ్యలు ఈ టైటిల్‌పై అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాయి. ‘డ్యూడ్’ సినిమా ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ఆయన, “ప్రభాస్ సినిమా టైటిల్ అదే ఉంటుందా లేదా అనేది ఈ నెలలోనే ఖరారవుతుంది” అని చెప్పడంతో, ‘ఫౌజి’ ఫైనల్ అయినట్లు భావించిన వర్గాలు ఒక్కసారిగా ఆందోళన చెందాయి.
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ చిత్రం ఇటీవల విడుదలై భారీ హైప్ సొంతం చేసుకున్న నేపథ్యంలో, ‘ఫౌజి’ అనే టైటిల్ సౌండింగ్ కూడా దానికి దగ్గరగా ఉండడంతో మేకర్స్ మరోసారి ఆలోచనలో పడినట్లు సినీ వర్గాల టాక్. ఈ కారణంగానే దర్శకుడు టైటిల్ మారే అవకాశం ఉందని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రభాస్ అభిమానుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించింది, ఎందుకంటే వారు ఇప్పటికే ‘ఫౌజి’ టైటిల్‌ను దాదాపు ఖరారు అయినట్లుగా భావించారు.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నప్పటికీ, దర్శకుడి వ్యాఖ్యలతో చివరి క్షణంలో టైటిల్ మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. దీంతో మేకర్స్ హడావుడిగా కొత్త పేర్ల కోసం పరిశీలన చేపట్టినట్లు సమాచారం. ఇంత తక్కువ సమయంలో ప్రభాస్ స్థాయికి తగిన, పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు సరిపోయే పవర్ఫుల్ టైటిల్‌ను వెతకడం యూనిట్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి.









