టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచరల్ థ్రిల్లర్ ‘శంబాల’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్ ‘శంబాల’పై భారీ అంచనాలను పెంచగా, “అతని క్రిస్మస్. ఇది కేవలం వెలుగు కాదు అది ఓ శక్తి. డిసెంబర్ 25న అగ్ని, ఉగ్రత, విధిని కలిపిస్తుంది” అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘శంబాల’ కథాంశం ఒక ప్రత్యేకమైన సూపర్ నేచరల్ థ్రిల్లర్‌గా తెలుస్తోంది. అంతరిక్షం నుంచి అతీంద్రియ శక్తులున్న ఒక రాయి గ్రామంలో పడగా, అప్పటి నుంచి జరిగే పరిణామాలు, ఆ రాయి ప్రభావంతో ప్రజలు చనిపోవడం వంటి సంఘటనల చుట్టూ కథ అల్లుకున్నట్లు సమాచారం. సైన్స్‌కు అందని రహస్యాలను మూఢ నమ్మకాలకు ముడిపెడుతూ ఈ పవర్ ఫుల్ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, రవివర్మ, స్వాసిక, మధునందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ క్రిస్మస్ బరిలో **’శంబాల’**తో పాటు మరో రెండు క్రేజీ సినిమాలు పోటీ పడనున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ కూడా క్రిస్మస్‌కే రిలీజ్ కానుంది. అలాగే, యంగ్ హీరో రోషన్ మేక నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ సైతం డిసెంబర్ 25నే విడుదల కానుంది. మొత్తంగా ఈ మూడు హ్యాట్రిక్ మూవీస్ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి.









