పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab), హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fauji) చిత్రాలు చేస్తున్నారు. ‘ది రాజా సాబ్’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా, ‘ఫౌజీ’ కొంత ఎక్కువ పెండింగ్ ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ పవర్‌ఫుల్ కాప్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ కొత్త గెటప్ ట్రై చేస్తాడని తెలుస్తోంది. ‘స్పిరిట్’లోని ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని, అంతేకాదు ఈ సీక్వెన్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ భారీ అంచనాల చిత్రంలో త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) హీరోయిన్‌గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ (Harsha Vardhan Rameswar) సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ (T series), భద్రకాళి పిక్చర్స్ (Bhadrakali pictures) సంయుక్తంగా ‘స్పిరిట్’ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.









