బండ్ల గణేష్ ఇంట్లో వైభవంగా దీపావళి వేడుకలు: చిరంజీవి, వెంకటేష్ సందడి

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది మాదిరిగానే గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసిన బండ్లన్న, ఈసారి ఇండస్ట్రీ ప్రముఖులందరినీ తన ఇంటికి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు పాల్గొన్నారు. వీరితో పాటు తేజ సజ్జా, సిద్ధూ జొన్నలగడ్డ వంటి యువ హీరోలు, అనేకమంది దర్శక నిర్మాతలు కూడా ఈ దీపావళి సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు.

ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను బండ్ల గణేష్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రముఖులు అందరూ కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పుకోవడం, సరదాగా గడపడం కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోలో బండ్ల గణేష్ ఇంటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇల్లు ఒక ప్యాలెస్‌ను తలపించేలా అత్యంత వైభవంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఒక సాధారణ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన ఇంట్లో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం, ఆ వీడియోను అభిమానులతో పంచుకోవడం ద్వారా బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు