ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు: టార్గెట్ రెండేళ్లే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఆసుపత్రి భవనాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా, నూతన ఆసుపత్రి అవసరాలకు అనుగుణంగా ఆధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆధునాతన పరికరాల ఏర్పాటుకు తగిన విధంగా గదుల నిర్మాణం, ల్యాబ్‌లు మరియు ఇతర నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణ పనుల వేగం కోసం, వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో కూడిన ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పది రోజులకు ఒకసారి పర్యటించాలని ఆదేశించారు.

భవన నిర్మాణం వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో, ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు