‘అదృష్టం లేకున్నా తగ్గని క్రేజ్’: బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా శ్రీలీల

టాలీవుడ్‌లో కొన్ని పరాజయాలు ఎదురైనా, నటి శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ బిజీగా ఉంది. హిందీలో ఇంకా అరంగేట్రం చేయకముందే ఆమె రెండో సినిమా ఆఫర్‌ను దక్కించుకోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే, రష్మిక మందన్న మాదిరిగా శ్రీలీల కూడా బాలీవుడ్‌లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల ఆషికీ ఫ్రాంచైజీ మూడవ భాగంలో కార్తీక్ ఆర్యన్‌ సరసన నటిస్తోంది.

‘ఆషికీ 3’ మూవీ ఇంకా సెట్స్‌పై ఉండగానే, ఆమెకు మరో పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఇటీవల రణవీర్ సింగ్, బాబీ డియోల్‌తో కలిసి శ్రీలీల నటించిన ఒక భారీ బడ్జెట్ యాడ్ (దాదాపు రూ. 150 కోట్లు) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాడ్‌లో శ్రీలీల రెడ్ డ్రెస్సులో గ్లామరస్‌గా కనిపించడం, ఆమె బాడీ లాంగ్వేజ్ బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఉండటంతో, మరికొంతమంది బీ-టౌన్ నిర్మాతలను ఆమె ఆకర్షించినట్లు సమాచారం.

గతంలో కొన్ని ఫ్లాప్‌లతో ఇబ్బంది పడినప్పటికీ, ‘పుష్ప-2’ మూవీలో ఐటెం సాంగ్ చేసి శ్రీలీల అందరినీ అలరించింది. ఈ పాన్ ఇండియా సినిమా హిట్ కావడంతో, ఆ పాట ద్వారా ఆమెకు హిందీలో మంచి క్రేజ్ లభించింది. ఈ క్రేజ్ వల్లే ఆమెకు హిందీలో వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో పాటు హిందీలో ‘ఆషికీ 3’, తమిళంలో ‘పరాశక్తి’ చిత్రాలు చేస్తోంది. ఈ తెలుగు చిత్రాలు హిట్ అయితే శ్రీలీల మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ స్టేటస్ దక్కించుకోవడం ఖాయం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు