కర్నూల్ బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది: బైక్ స్కిడ్ వల్లే అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదంలో 20 మంది అమాయకులు అగ్నికి ఆహుతయ్యారు. మొదట్లో ఇది బస్సు బైక్‌ను నేరుగా ఢీకొట్టడం వల్లే జరిగిందని భావించినప్పటికీ, పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు మిస్టరీ వీడింది. స్వల్ప గాయాలతో బయటపడిన బైక్‌పై వెనుక కూర్చున్న ఎర్రిస్వామిని ప్రశ్నించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి బైక్‌పై డోన్‌కు బయలుదేరగా, మార్గమధ్యంలో శివశంకర్ మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి, వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. ఎర్రిస్వామి తన స్నేహితుడిని చూసేందుకు వెళ్లగా, బైక్ రోడ్డు మధ్యలో ఉండిపోయింది.

ఈ సమయంలోనే అదే మార్గంలో వేగంగా వస్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను ఢీకొని చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి, ఫలితంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎర్రిస్వామి వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై క్లారిటీ వచ్చింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో 20 మంది సజీవదహనం అయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు