ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక మందన్న సరదా చిట్‌చాట్: 500 ఏళ్ల వాలెంటైన్ ప్రపోజల్‌కు చమత్కార సమాధానం!

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నటి రష్మిక మందన్న, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించారు. ఈ సరదా చిట్‌చాట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె నిజాయితీగా, చమత్కారంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్న మరియు ఆమె ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓ అభిమాని రష్మికను సరదాగా, “రాబోయే 400-500 సంవత్సరాల పాటు నా వాలెంటైన్‌గా ఉంటారా?” అని అడిగాడు. దీనికి రష్మిక నవ్వుతూ, “ఈ జన్మలోనే మరో 100 ఏళ్ల తర్వాత మనం బతికి ఉంటే తప్పకుండా ఉందాం” అని చమత్కారంగా సమాధానమిచ్చింది. ఈ చమత్కారంతో కూడిన ఆమె సమాధానం అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.

ఈ సెషన్‌లోనే మరో అభిమాని రష్మికను, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ షూటింగ్ అనుభవం గురించి అడిగాడు. దీనికి రష్మిక సీరియస్‌గా స్పందిస్తూ, “ఈ సినిమా షూటింగ్ నా జీవితంలో అత్యంత భావోద్వేగంగా గడిచింది. మానసికంగా చాలా అలసిపోయే అనుభవం ఇది. మనం మర్చిపోవాలనుకునే భావోద్వేగాలను మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది” అని తెలిపింది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు