దర్శకుడు లోకేష్ కనగరాజ్, నిన్నమొన్నటి వరకు ‘బ్రాండ్’ ఇమేజ్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ (ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో) అందుకున్నారు. అయితే, రీసెంట్‌గా రజినీకాంత్‌తో కలిసి తీసిన ‘కూలీ’ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో, లోకేష్ కెరీర్‌పై ఆ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. మొన్నటివరకు ఒకే అయిన ‘ఖైదీ 2’ కూడా బడ్జెట్ కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు తమిళనాట వైరల్ అవుతున్నాయి.
తాజాగా, లోకేష్ కనగరాజ్ ఒక స్టార్ హీరోకి కథ వినిపించగా, ఆ కథను సదరు హీరో రిజెక్ట్ చేశాడనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో మరెవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్. లోకేష్-కమల్ కాంబోలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ అనుబంధంతోనే లోకేష్, కమల్‌ను కలిసి ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ కథను వినిపించాడట.
అయితే, కమల్ హాసన్ ఆ కథలో కొత్తదనం లేకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఒకే ఒక్క ప్లాప్‌తో లోకేష్ కనగరాజ్‌కు వచ్చిన ఈ ఎదురుదెబ్బ చూసి, “హిట్ ఇచ్చినా పక్కన పెట్టేశాడుగా.. అలాగే ఉంటది మరి” అంటూ సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళనాట వైరల్ అవుతోంది.









