ఆ నలుగురు డైరెక్టర్లు అడిగితేనే స్పెషల్ సాంగ్ చేస్తా: రష్మిక మందన కండిషన్!

పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన తన కెరీర్‌కు సంబంధించి సంచలన ప్రకటన చేసింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో పాల్గొన్న రష్మిక, నెగెటివ్ రోల్స్ మరియు స్పెషల్ సాంగ్స్ (ఐటెం సాంగ్స్) చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అయితే, ప్రత్యేక గీతాల్లో నటించడానికి తాను కొన్ని కండిషన్స్ పెడుతున్నానని, తన మనసులో ఉన్న నలుగురు దర్శకులు అడిగితేనే చేస్తానని స్పష్టం చేసింది. ఆ నలుగురు దర్శకులు అడగకపోతే ఎవరు అడిగినా తాను ప్రత్యేక గీతాల్లో నటించనని ఖరాఖండిగా చెప్పింది.

వెరైటీ రోల్స్ చేయడం తనకు ఇష్టమని చెప్పిన రష్మిక, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నెగెటివ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా తనకు అభ్యంతరమేమీ లేదని తెలిపింది. ఇక స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ, తాను అంగీకరించే ఆ నలుగురు దర్శకుల పేర్లు మాత్రం చెప్పనని అంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో శ్రద్ధా కపూర్, తమన్నా భాటియా, కృతి సనన్, జాన్వీ కపూర్ వంటి చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్రత్యేక గీతాలతో అలరిస్తున్నారు. నాలుగు నిమిషాల పాటకే భారీ రెమ్యునరేషన్ వస్తుండటంతో వారు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక, తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోంది. ఆమె ఒక్క మాట చెబితే స్పెషల్ సాంగ్స్‌కు కూడా భారీ పారితోషికం ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. రష్మిక మనసులో ఉన్న ఆ నలుగురు దర్శకులు ఎవరై ఉంటారు, వారు రష్మికతో త్వరలోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తారా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు