పీఎం కిసాన్ నిధులు విడుదల: 9 కోట్ల మంది రైతులకు ₹18,000 కోట్లు జమ

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి మద్దతుగా అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద నిధులను విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కొయంబత్తూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేశారు. ఈ విడుతలో దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో ₹18,000 కోట్లకు పైగా మొత్తం జమ చేయబడనుంది, దీని ద్వారా వేలాది మంది రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం, అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది మూడు విడుతల్లో ₹2,000 చొప్పున మొత్తం ₹6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇప్పటివరకు కేంద్రం మొత్తం 20 విడుతల్లో ₹3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

భూమి వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, తమ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసిన రైతులు ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి పెట్టుబడి మద్దతు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు