మహేష్ బాబు అన్న కొడుకు డెబ్యూ కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో తెరంగేట్రం చేయబోతున్నాడు. దివంగత కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ, ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోగా లాంచ్ అవుతున్నాడు. ప్రస్తుతానికి #AB4 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత సి. అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ డెబ్యూ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

జయకృష్ణ డెబ్యూ మూవీని భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా, సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు దర్శకుడు అజయ్ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ప్రతి కథకూ ఆత్మను తాకే సౌండ్ అవసరం అవుతుంది. నా నెక్స్ట్ మూవీ #AB4 కోసం టాలెంటెడ్ మ్యూజికల్ మెజీషియన్ జీవీ ప్రకాష్ కుమార్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.

కాగా, తెలుగు, తమిళ చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించిన జీవీ ప్రకాష్ కుమార్, ‘ఆకాశం నీ హద్దుగా’, ‘సార్’ వంటి సినిమాలకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. ఆయన ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో జయకృష్ణకి జోడీగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు