కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం: వీధి కుక్కల దాడికి పరిహారం పెంపు

వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అదేవిధంగా, కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5 వేల పరిహారం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రూ.5 వేలలో రూ.3,500 నేరుగా బాధితుడికి అందజేస్తారు. మిగిలిన రూ.1,500ను చికిత్స ఖర్చుల కోసం సురక్ష ట్రస్టు (కర్ణాటక ఆరోగ్య శాఖలో భాగం) కు కేటాయిస్తారు. 2023లో జారీ చేసిన ఉత్తర్వులకు ప్రస్తుత ఉత్తర్వులలో పరిహారం చెల్లించే విధానంలో మార్పులు చేశారు.

కుక్క కాటుతో బాధితుడు ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రిలో తక్షణ చికిత్స పొందినప్పటికీ, ఆ చికిత్సకు సంబంధించిన ఖర్చులను కూడా ప్రభుత్వం భరించనుంది. ఈ పరిహారం పంపిణీకి, కేసులను అంచనా వేయడానికి గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలోకి వచ్చే అన్ని మున్సిపాలిటీ కార్పోరేషన్లలో ధృవీకరణ, పరిహార పంపిణీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు ఉన్నందున, కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, వీధి కుక్కల సమస్యపై ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్/రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు వంటి బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, వీధి కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని, ఈ తరలింపునకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెట్లర్లకు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు