నాగచైతన్యకు మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్: NC24 టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్!

అక్కినేని యువ హీరో నాగచైతన్య తన తదుపరి చిత్రం NC24కు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23, ఆదివారం ఉదయం 10:08 గంటలకు ఈ లాంచ్‌ జరగనుంది. ‘తండేల్’ విజయంతో మంచి ఊపుమీదున్న చైతూకి, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఈ స్పెషల్ గిఫ్ట్ అందనుండటం అక్కినేని, ఘట్టమనేని అభిమానుల్లో పెద్ద హైప్ సృష్టించింది.

‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం పూర్తిస్థాయి యాక్షన్-ఎమోషనల్ మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్‌తో మరియు టాప్-నాచ్ టెక్నికల్ వర్క్‌తో రూపొందుతోంది. ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, మహేశ్ బాబు ఏ టైటిల్‌ను ప్రకటిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటిస్తున్న మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన అందుకుంది. ఆమె ఇందులో “దక్ష” అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక నూతన మలుపు అవుతుందని తెలుస్తోంది. మరోవైపు, మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో ఆయన రాముడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు