స్మృతి మంధాన పెళ్లి వాయిదా: తీవ్ర ఒత్తిడితో పలాష్ ముచ్చల్ అస్వస్థతపై తల్లి షాకింగ్ కామెంట్స్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, అనుకోని ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు గుండెపోటు రావడంతో అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితులలో, ఇరు కుటుంబాలు కలిసి వివాహాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయని పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ అధికారికంగా ప్రకటించారు.

ఈ గందరగోళ పరిస్థితుల్లో, వరుడు పలాష్ ముచ్చల్ కూడా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పలాష్ తల్లి అమిత ముచ్చల్, “పలాష్ తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో నాలుగు గంటలపాటు చికిత్స అందించారు. ఈసీజీ సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొంత స్థిరంగా ఉన్నాడు కానీ మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లిని వాయిదా వేయాలని స్మృతి కంటే ముందే పలాష్ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు.

అయితే, పెళ్లి వాయిదా పడిన వెంటనే స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలాష్‌తో ఉన్న అన్ని ఫోటోలు, వీడియోలను తొలగించడం కొత్త అనుమానాలకు దారితీసింది. అంతేకాకుండా, పలాష్ ముచ్చల్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక చాట్ వైరల్ కావడంతో, ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అనుకోని ఒత్తిడికి దారి తీసినవేనని కుటుంబ వర్గాలు చెబుతున్నప్పటికీ, స్మృతి లేదా పలాష్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు