బంగారం ధరల అంచనా: 2026 నాటికి రూ. 1.5 లక్షలు దాటే అవకాశం

బంగారం ధరలు వచ్చే ఏడాది తగ్గుతాయని చాలా మంది పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నప్పటికీ, అగ్రశ్రేణి అమెరికన్ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా మాత్రం దీనికి భిన్నంగా అంచనా వేసింది. 2026 నాటికి ప్రపంచ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరిగి, పది గ్రాముల ధర రూ. 1,40,000 నుండి రూ. 1,57,000 మధ్య చేరే అవకాశం ఉందని ఈ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుతం అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, స్థిరంగా లేని వడ్డీ రేట్ల కారణంగా భయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారాన్ని ఎంచుకోవడం, అలాగే సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం వంటి కారణాల వల్ల రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి కారణమవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరను సాధారణంగా ఔన్స్‌లో (సుమారు 28.35 గ్రాములు) కొలుస్తారు. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగితే, ఒక్క గ్రాము ధర రూ. 14,000 నుంచి రూ. 15,000 వరకు చేరే అవకాశం ఉంది. దీని ఆధారంగా, 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 1,40,000 నుండి రూ. 1,57,000 మధ్య ఉండవచ్చు. అయితే, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. వాస్తవ ధర మన దేశంలోని డిమాండ్, భారత రూపాయి విలువ, పన్నులు, ఇతర మార్కెట్ పరిస్థితులు ఆధారంగా మారుతుంది.

భారతదేశంలో బంగారం ధర ఎప్పుడూ ప్రపంచ మార్కెట్‌తో పాటు దేశీయ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రూపాయి విలువ బలహీనంగా ఉండటం, భారత్‌లో పెళ్లిళ్లు, పండుగలకు బంగారానికి ఉన్న అధిక ఆసక్తి వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పిన అత్యధిక అంచనా ప్రకారం, రూపాయి బలహీనపడి, ప్రపంచ మార్కెట్ ధరలు పెరిగితే, 10 గ్రాముల ధర రూ. 1.57 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే 10 గ్రాముల ధర రూ. 1.30–రూ. 1.40 లక్షల మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు