స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్‌: పెళ్లిపై కొనసాగుతున్న సందిగ్ధత

భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటానికి కారణమైన స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. పెళ్లికి కొన్ని గంటల ముందు అస్వస్థతకు గురైన ఆయనకు, ఆసుపత్రిలో మెరుగైన నిర్ధారణ కోసం వైద్యులు యాంజియోగ్రఫీ నిర్వహించారు. ఇందులో గుండెకు రక్త ప్రసరణలో ఎటువంటి అడ్డంకులు లేవని, ఆయన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని తేలింది. అన్ని పరీక్షలు, చికిత్సల అనంతరం శ్రీనివాస్ మంధానను మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

తన తండ్రి ఆరోగ్యం కోలుకోవడమే తనకు ముఖ్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్మృతి మంధాన స్పష్టంగా చెప్పినట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధ్రువీకరించారు. అయితే, ఒకవైపు తండ్రి కోలుకోవడం సంతోషాన్నిచ్చినా, మరోవైపు కాబోయే భర్త పలాష్ ముచ్ఛల్ సైతం స్వల్ప అనారోగ్యానికి (వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ) గురై చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కావడంతో పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఇప్పటికే స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి వేడుకల ఫొటోలను తొలగించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు కుటుంబాలు పెళ్లి కొత్త తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పలాష్ తల్లి అమితా ముచ్చల్ సైతం వదంతులను ఖండిస్తూ, మామగారు కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని పలాషే పట్టుబట్టాడని ఇంతకుముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు