వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి జనసేనలో చేరాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా ఆయన ఛైర్మన్‌ను కోరారు.
జయమంగళ వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాదాపు ఏడాది దాటినా, శాసనమండలి ఛైర్మన్ దానిని ఆమోదించలేదు. దీంతో ఆయన న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం… జయమంగళ వెంకటరమణ రాజీనామాపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్‌ను ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే, జయమంగళ వెంకటరమణ నేడు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును వ్యక్తిగతంగా కలిశారు. జనసేనలో చేరేందుకు వీలుగా, పెండింగ్‌లో ఉన్న తన రాజీనామాను ఆమోదించాలని ఆయన చైర్మన్‌ను కోరారు.









