ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తరచుగా సర్‌ప్రైజ్ అప్‌డేట్‌లను అందిస్తుంటారు. గతంలో టీసీఎస్ వంటి కంపెనీల పెట్టుబడుల సమయంలో ఇలాగే ట్వీట్ చేసిన లోకేష్, తాజాగా మరోసారి ఆసక్తికర ట్వీట్‌తో నెటిజన్లకు ఒక పజిల్ విసిరారు. “వైజాగ్ గెట్ రెడీ.. ప్రపంచ ఛాంపియన్లు ఈ నెలలోనే వచ్చేస్తున్నారు. ఎవరో ఊహించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నారా లోకేష్ ట్వీట్‌పై నెటిజనం చాలావరకు సరైన సమాధానం ఇచ్చారు. ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు రాకను ఉద్దేశించే మంత్రి ఈ ట్వీట్ చేశారని ఎక్కువ మంది అంచనా వేశారు. భారత మహిళల జట్టు శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లు డిసెంబర్ 21 మరియు డిసెంబర్ 23 తేదీలలో విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
మరికొంతమంది నెటిజన్లు మాత్రం అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ తరహాలో మరేదైనా అంతర్జాతీయ స్టార్ వస్తున్నారా అంటూ కామెంట్లు చేశారు. అయితే ఎక్కువ మంది మాత్రం రాబోయే క్రికెట్ మ్యాచ్‌ల గురించే లోకేష్ ట్వీట్ చేశారని నిర్ధారించారు. డిసెంబర్‌తో పాటు, జనవరి 26న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మరో టీ20 మ్యాచ్ కూడా విశాఖ వేదికగా జరగనుంది. ఈ విధంగా, విశాఖలో వరుసగా మూడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.









