శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం: 70 రోజులకు కోటి 17 లక్షలు…

శ్రీస్వామి వారి హుండీ లెక్కింపు మొత్తం రూ.1,17,44,339/-
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము, కదిరి కి సంబందించిన హుండిల లెక్కింపు కార్యక్రమము 16.12.2025 వతేది మంగళవారంలెక్కింపు పూర్తి అయినందున నగదుగా రు.1,17,44,339/-లు మొత్తము 70 రోజులకు వచ్చినది.
మరియు విదేశి కరెన్సీ వివరములు..
(1) USA Dollars : 24 Dollars
(2) Oman : 2 Dials.
(3) Canada Dollars: 10
(4) Srilanka Rupe : 100
బంగారు 23 గ్రాములు, వెండి 753 గ్రాములు కలదు.
హుండీల లెక్కింపు కార్యక్రమము ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యములో లెక్కింపు చేపట్టడమైనది. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా నరసింహరాజు, జిల్లా దేవాదాయశాఖ అధికారి, వారు హాజరు అయినారు. హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది మరియు కెనరా బ్యాంకు, మేనేజర్, బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు