విదేశీ పక్షుల్లా వచ్చే వైసీపీ నాయకులను నమ్మకండి: కదిరి విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట పిలుపు

తెలుగుదేశ పార్టీ విస్తృతస్థాయి సమావేశం!
శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మునుపెన్నడూ లేని విధంగా చేశామని తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కేవలం ఎలక్షన్లో సమయంలో మాత్రమే వీరాపురంలోని విదేశీ పక్షుల లాగా కదిరిలో వాలిపోతారని, ఎలక్షన్ అయిన మరుక్షణమే వారి పత్తా ఏమాత్రం కనిపించదని, తెలుగుదేశం నాయకత్వం ఎప్పుడు, ప్రత్యేకించి నేను ప్రజల కోసమే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతానని, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు నన్ను ఎన్నుకున్నందుకు వారి రుణం నేను తీర్చుకోలేనిదని కార్యకర్తల పట్ల ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉంటానని కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, మున్సిపల్ చైర్మన్ బహుద్దీన్ దిల్షాద్ దున్నిసా, కమలాపురం నియోజకవర్గం మనోహర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ లు, బూత్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు