శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి రూరల్ మండలం కాలసముద్రం గ్రామంలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. పాపం పసిపాప భూమ్మీద పుట్టిన మూడు రోజులకే తల్లిదండ్రులకు బరువైందేమో ఆ పసిక అందుకు మాటలు వస్తే ఎముకల కొరికే చలిలో రోడ్డు పక్కన నన్ను వదిలి వెళ్ళడానికి చేతులు ఎలా వచ్చాయని నిలదీస్తుందేమో. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో చెట్ల పొదల మధ్య పసిపాప అరుపులు వినిపించడంతో అటువైపు వెళుతున్న స్థానికులు ఆ అరుపులను విని టార్చ్ లైట్ సహాయంతో చూడగా పాపగా గుర్తించడం జరిగింది. వెంటనే వారు పోలీసు వారికి తెలియజేయగా, వైద్య పరీక్షల కోసం పాపను ఆసుపత్రికి తరలించి, పాప ఆరోగ్యం కుదురుగా ఉందని నిర్ధారించడం జరిగింది. ఇందుగల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Post Views: 65









