యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్..

  • యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్..
  • సత్యసాయి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయం..అది కదిరి నుండే ప్రారంభం..
  • ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాని కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి జిల్లా ఎస్పీ పిలుపు..
  • మత్తుకు బానిస కావద్దు.. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు.. ఎమ్మెల్యే …
  • కదిరిలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన ర్యాలీ..

ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ విభాగం గౌరవ శ్రీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్ గారి సూచనల మేరకు..

డ్రగ్స్ వాడకం “మానవ మనుగడ” కు అనర్ధం అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అన్నారు.

యువతను మత్తు పదార్థాల మాయజాలం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవారిచే లక్ష్యంతో కదిరిలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన ర్యాలీ శనివారం ఘనంగా నిర్వహించారు. తొలత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు, ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ గారు, ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పట్టణంలోనే వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు పట్టణ ప్రముఖులు, ఐసిడిఎస్, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో పోలీసుల వలె బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అతి తక్కువ ప్రాంతంలో డ్రగ్స్ వాడకం కనిపిస్తోందని, దానిని కూడా నిర్మూలించాలని గట్టి సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు లేదా లోకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. “నేను గంజాయి తీసుకోను- నా ప్రాంతంలో గంజాయి వాడనివ్వను” అని ప్రతి ఒక్కరు వాగ్దానం తీసుకోవాలన్నారు. యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని లేదంటే సమాజంలో చిన్నచూపు, కుటుంబంలో కలహాలు, తమ ఉజ్వలమైన భవిష్యత్తు కూడా నాశనం చేసుకుంటారన్నారు. కాబట్టి పోలీసులకు ప్రతి ఒక్కరూ తోడుగా ఉంటూ గంజాయి లేని సత్యసాయి జిల్లా చేయడానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ…

డ్రగ్స్.. యువత భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అని
ఎవ్వరూ “డ్రగ్స్ వాడవద్దు” అనే సందేశం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే కార్యక్రమం కదిరిలో నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడడం, అమ్మడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అమ్ముతూ, వాడుతూ పట్టుబడి… నేరం రుజువు ఐతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు. గంజాయి క్వాంటిటీని బట్టి శిక్ష ఖరారు అవ్వడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి యువత జాగ్రత్త వహించాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే 1972, 112 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఒక్క కదిరి ప్రాంతంలో మాత్రమే 40 నుంచి 42 మంది గంజాయి కేసుల్లో పట్టుపడడం జరిగిందన్నారు. వీరిపై పీడీ యాక్ట్ తో పాటు నగర బహిష్కరణ చేస్తున్నామన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. దీనిని బట్టి ప్రజలు గమనించాల్సింది ఏమంటే? గంజాయి వాడి, అమ్మేవారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు, మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఎవరైనా గంజాయి వాడుతున్నట్లు తెలిసిన తక్షణమే పోలీసులకు సమాచారం ఇస్తే కట్టడి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. అదే చెప్పకపోతే క్యాన్సర్ మహమ్మారి లాగా గంజాయి వాడకం అధికమై పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఇది గమనించి, ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి గంజాయి నిర్మూలనకు కృషి చేద్దామని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. అనంతరం నిజాంవలి కాలనీలో గంజాయి అమ్మేవారి ఇళ్ల వద్దకు జిల్లా ఎస్పీ గారు వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటువంటి వాటికి స్వస్తి పలకాలని, లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని ఎస్పీ గారు హెచ్చరించారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ…

తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరించాలన్నారు ఇలా చేయడం వల్ల వారి ప్రేమ పిల్లల పట్ల మత్తుగా ఉంటుందని ,వారికి మరో మత్తు అవసరం లేదన్నారు. పిల్లలు తల్లిదండ్రుల వద్ద అధికంగా ఉంటారు…కాబట్టి విద్యార్థులను గమనిస్తూ మంచి మార్గంలో నడిపించాలని సూచించారు. విద్యార్థులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన తర్వాత వచ్చే తరానికి కూడా మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లవచ్చు అని తెలియజేశారు. కాబట్టి ఎవ్వరూ కూడా మత్తుకు బానిస కావద్దన్నారు. మత్తుకు బానిస అయితే అనారోగ్యం పాలవుతారన్నారు. దీనిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలియజేశారు.

అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో R&B గెస్ట్ హౌస్ నుండి ఆర్టీసీ సర్కిల్ వరకు ప్లకార్డ్స్ పట్టుకొని డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాలు చేస్తూ ఆర్టీసీ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వద్దు బ్రో అని నినాదాలు చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే తో పాటు, అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాని, డి.ఎస్.పి శివన్నారాయణ స్వామి, సీఐలు, నారాయణరెడ్డి నాగేంద్ర నిరంజన్ రెడ్డి డిటిఆర్బి
సి ఐ లక్ష్మి కాంత్ రెడ్డి , ఈగల్ ఆర్ఎస్ఐ శ్రీహరి, ఎస్సైలు బాబ్జాన్, గోపి, వలిబాష, ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రముఖులు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

* కదిరి పోలీస్ సబ్ డివిజన్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు