- ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర .
- పేదల నడ్డి విరిచేందుకే ఉపాధి హామీ పేరు మార్పు.
- త్వరలో చలో రాజ్ భవన్ ముట్టడి:-
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్.
పుట్టపర్తి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ లు పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షతన బి కదిరప్ప
సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిఆర్డీవో
కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ లుమాట్లాడుతూ వలసలు నివారించేందుకు 11 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. ఇప్పటికే పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చిందన్నారు. ఉపాధి చట్టం కింద చేసే పనులకు సంబంధించి సగం డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని మాజీ ముఖ్యమంత్రి జగన్ కానీ స్పందించలేదన్నారు. రాష్ట్రంపై నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసిన వారు పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కలిసివచ్చే రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాయని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టాన్ని 2004లో సత్యసాయి జిల్లా బండ్లపల్లి లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలలో ఓట్లలో లక్షల ఎత్తివేయడం జరిగిందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలతో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద్, ఏఐటీయూసీ జిల్లా జాయింట్ సెక్రెటరీ వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కుల్లాయప్ప, జిల్లా నాయకులు వెంకటనారాయణ, ముత్యాలమ్మ, చౌడప్ప, నరసింహులు, వెంకటనారాయణ, కొండయ్య ,ఆదినారాయణ, చరణ్ బ్రహ్మయ్య
బుక్కపట్నం మండల కార్యదర్శి శిక్షావలి, కొత్తచెరువు మండల కార్యదర్శి గాజుల వెంకటేష్, సిపిఐ నాయకులు చాంద్ బాషా, లలితమ్మ అన్ని మండలాల కార్మికులు పాల్గొన్నారు.









