గర్భిణీ పై వైసీపీ కార్యకర్త దాడి!

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో గర్భిణీ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ముత్యాల వాండ్లపల్లి లో వైసిపి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అదే గ్రామానికి చెందిన ఏడు నెలల నిండు గర్భిణి సంధ్యారాణి ఇంటి వద్ద పదేపదే బాణసంచా కాల్చడంతో ఆ శబ్దాలతో ఇబ్బందిగా ఉందని పక్కకు వెళ్లి కాల్చుకోమని ఆమె చెప్పగా, దీంతో ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు