APTWR ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు
శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో ఉన్న ఏపీ టీ డబ్ల్యూ ఆర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు, ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి రాగా వెంటనే పాఠశాలలను సందర్శించి అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తా ఉందని, స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించమని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, కదిరి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గిరిజన నాయకులు పాల్గొన్నారు.
Post Views: 30









