“నా పేరు ఐబొమ్మ రవి కాదు.. ఇమ్మడి రవి….

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, సోమవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనను అందరూ ‘ఐబొమ్మ’ రవి అని పిలుస్తున్నారని, కానీ తన అసలు పేరు ఇమ్మడి రవి అని స్పష్టం చేశారు. పోలీసులు అభియోగాలు మోపినంత మాత్రాన తాను నేరం చేసినట్లు కాదని, కేవలం పోలీసుల మాటలను బట్టి తనను నేరస్తుడిగా ప్రచారం చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలోనే ఉంటున్నానని రవి వెల్లడించారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న విషయం వాస్తవమేనని, అయితే అది చట్టవిరుద్ధమేమీ కాదని ఆయన వివరణ ఇచ్చారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారంపై కోర్టులోనే న్యాయపోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ కేసులో ఉన్న పూర్తి నిజాలను బయటపెడతానని ఆయన పేర్కొన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలతో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రవి తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన కోరారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తన పాత్రపై జరుగుతున్న ప్రచారంలో అనేక అపోహలు ఉన్నాయని, న్యాయ ప్రక్రియకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఇమ్మడి రవి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు