బిజెపి స్టేట్ మీడియా కో… కన్వీనర్ అంబన్నకు ఘన సన్మానం, భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా కో.. కన్వీనర్ గా కర్నూలు జిల్లా నుండి ఎంపికైన తెలుగు అంబన్న ను ఎస్ టి వి స్టేట్ ఇన్చార్జ్ వీరశేఖర్ రెడ్డి, రాయలసీమ ఇంచార్జ్ లోకేశ్వర్ రెడ్డి, కర్ణాటక ఇంచార్జ్ ఏ సీతారామశాస్త్రిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంబన్న మాట్లాడుతూ తనకు ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందని, చిత్తశుద్ధితో పనిచేసి మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తానని అంబన్న వెల్లడించారు. తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న s9 టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్ అధినేత కంచం ప్రభాకర్ రెడ్డిని ఈ సందర్భంగా అంబన్న ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సూరజ్ నభీ, బీజేపీ నాయకులు పరంధామ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తనపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్తర బాధ్యతను అప్పగించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్, బిజెపి రాష్ట్ర సంఘటన శాఖ మంత్రి మధుకర్ జీ, రాష్ట్ర బిజెపి OBC మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్,బీజేపీ నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ లను కలిసి శాలవారితో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.









