శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు పలు మెడికల్ షాపులను డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు, మరియు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఇందులో సుమారు 20 మెడికల్ షాపులు తనిఖీలు చేసి మత్తు కలిగించే ఔషధాలు అమ్మే విషయంలో వారి రికార్డులను పరిశీలించగా అందులో ఐదు మెడికల్ షాపులు నిర్వహణ సరిగా లేనందున వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించినట్లయితే ఆ మెడికల్ షాపులను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ తనిఖీలలో కదిరి పట్టణ డిఎస్పి శివ నారాయణస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ వీర కుమార్ రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేశవరెడ్డి,మాధవి, కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి, కదిరి పట్టణ ఎస్ఐ బాబ్జాన్,ధనుంజయ రెడ్డి సిబ్బందితోపాటు పాల్గొనడం జరిగింది.
Post Views: 61









