శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం రాగినే పల్లి గ్రామానికి చెందిన ఎర్రి శిరీష అనే మహిళ తప్పిపోయినట్లు తన భర్త ఎర్రి హరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి 8:30 గంటల కు పోలీసుల సిబ్బంది మదనపల్లి, గూడూరు ప్రాంతాలలో విచారణ చేపట్టి, తప్పిపోయిన మహిళ తిరుపతి జిల్లా గూడూరులో ఉన్నట్లు గుర్తించారు.
తప్పిపోయిన మహిళను తాసిల్దార్ ముందు హాజరు పరిచేందుకు పోలీసు సిబ్బంది ఆమెను తనకల్లు పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తుండగా సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ముందస్తు పథకం ప్రకారం ఎర్రి హరి, అతని సోదరుడు ఎర్రి చిన్నప్పలు పోలీస్ స్టేషన్ ఎదుట వేట కొడవళ్లతో ఈశ్వరప్ప అనే వ్యక్తిపై దాడి చేసి హత్య చేశారు.
ఈ ఘటనలో పోలీసు విధులకు ఆటంగా కలిగించడం, ప్రాణహానితో బెదిరింపులు చేయడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిందితుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసులు తెలియజేశారు.









