కదిరిలో 20 ఏళ్ల భూ సమస్యకు మోక్షం: 60 మంది బాధితులకు న్యాయం చేసిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి:

  • కదిరి లో 20 సంవత్సరాలుగా నెలకున్న సమస్య పరిష్కారం
  • రెవెన్యూ క్లినిక్ ద్వారా శాశ్వత భూ సమస్యకు పరిష్కారం చూపిన అధికారులు
  • 2004లో కుటాగుళ్ల గ్రామానికి చెందిన 60 మంది లబ్ధిదారుల ఇళ్లను కాజేసిన నాయకులు
  • కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అధికారుల చొరవతో 60 మంది లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
  • ల్యాండ్ సర్టిఫికెట్ల అందజేతతోపాటు పక్కా ఇండ్లను మంజూరు చేసిన అధికారులు
  • కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.
  • సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్
  • సీఎం చంద్రబాబు నాయకత్వంలో భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం
  • 2004లో కుటగుళ్ల లో ఇంద్రమ్మ ఇండ్లలో పెద్ద కుంభకోణం జరిగింది
  • 60 మంది లబ్ధిదారులు 20 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు
  • రెవెన్యూ క్లినిక్ ద్వారా వారి సమస్యను పరిష్కరించాం
  • ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ తో పాటు 60 మంది లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేసాం
  • వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లే విధంగా జగన్ వ్యవహరించాడు
  • జగన్ పాలన లో భూకబ్జాలు సెటిల్మెన్లు తప్ప ప్రజలకు చేసింది శూన్యం.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల లో 20 సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్యలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులు రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించారు. 60 మంది లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లతో పాటు పక్కా ఇండ్లను మంజూరు చేస్తూ ఆ పత్రాలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ 2004-2009 సంవత్సరాల మధ్య కుటాగుళ్ల లో ఇంద్రమ్మ ఇండ్లలో పెద్ద కుంభకోణం జరిగిందని అప్పటి కాంగ్రెస్ ఇప్పటి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నారు.పేదల ఇండ్లను లాక్కున్నారు అని ఆరోపించారు.60 మంది లబ్దిదారులు 20 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెవెన్యూ క్లినిక్ ద్వారా వారి సమస్యను పరిష్కరించామన్నారు. వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ పాలన లో భూకబ్జాలు సెటిల్మెంట్లు తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. శాశ్వత సమస్యకు పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు