టాలీవుడ్‌లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ నటి అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. మహిళలకు ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఆమె హితవు పలికారు. ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశి ప్రవేశించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. శివాజీ వ్యాఖ్యలను ఆమె పాక్షికంగా సమర్థించారు. ఆయన ఉద్దేశం తప్పు కాదని, కొన్ని పదాలు దొర్లడం వల్ల వివాదం పెద్దదైందని, దానికి ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. శివాజీకి మద్దతుగా నిలుస్తూనే, అనసూయ చేస్తున్న విమర్శలపై రాశి పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పేరు ఎత్తకుండా అనసూయకు రాశి గట్టి వార్నింగ్ ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం ఒక టీవీ షోలో తన పేరును (రాశి గారి ఫలాలు అంటూ) వెటకారంగా ఉపయోగించి నవ్వుకున్న విషయాన్ని రాశి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, పెద్దలను గౌరవించాలని ఆమె సూచించారు. దీంతో ఈ “డ్రెస్ కోడ్” వివాదం కాస్తా ఇప్పుడు సీనియర్ vs జూనియర్ నటీమణుల మధ్య యుద్ధంగా మారింది.









