శ్రీ నరసింహ స్వామి వారు శ్రీదేవి భూదేవి ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.శ్రీ వారు ఉగ్ర రూపం నుంచి శాంత రూపంలోకి రావాలని భక్త ప్రహ్లాదుడు కీర్తితించగా ఈ కొండపైనే శ్రీ స్వామి వారు మొదట పాదం మోపారని అందుకే ఈ ప్రాంతానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని ‘ఖా’ అనగా విష్ణుపాదం ‘అద్రి’ అనగా పర్వతం అని ప్రతీతి.
ప్రతి నెలా స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తూర్పు రాజగోపురం నుంచి ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్రగా బయలుదేరి శ్రీ కొండల లక్ష్మీ నారసింహుడుగా , కాటమ రాయుడుగా వెలసిన స్తోత్రాద్రికి శ్రీ వారి భక్తులు హరినామ కీర్తనలతో , గోవింద నామస్మరణతో స్తోత్రాద్రికి ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించడం జరుగును.
శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి ( కదిరి కొండ) గిరిప్రదక్షిణ 2026 వ సంవత్సరం తేదీల వివరాలు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు మరింత చేరువ అయ్యే విధంగా వీడియోను విడుదల చేసిన శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం వెంకట నరసింహాచార్యులు మరియు ఉప ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం కుమార్ రాజాచార్యులు. ఈ కార్యక్రమంలో కార్తికేయ డిజిటల్స్ కార్తీక్ , చక్రి , లక్ష్మణ కుటాల, రాజేంద్ర , ప్రసాద్, ఆకుల హరి ప్రసాద్,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!🙏🚩
ఇట్లు,
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి – కదిరి.









