వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మంగళవారం వరంగల్‌లోని చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆమె ఆలయానికి చేరుకోగా, ఆలయ ధర్మకర్తలు మరియు అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అన్నా లెజినోవా రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆమె మొదట ఆదిశంకరాచార్యులు మరియు వల్లభ గణపతిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆమె ఈ మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు వెంకటనాగరాజు శర్మ మరియు వేద పండితులు అన్నా లెజినోవాకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు