కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన స్ట్రైట్ తెలుగు సినిమా ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథన్ అండ్ సన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాలో నటిస్తున్న ఆయన, తన రెండో తెలుగు ప్రాజెక్టును కూడా ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ పరశురామ్ చెప్పిన కథకు సూర్య ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో సూర్య సరసన ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. తెలుగులో సూర్యకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలను పక్కా ప్లానింగ్‌తో రూపొందిస్తున్నారు.
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, తెలుగు దర్శకులపై నమ్మకంతో బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేయడం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పరశురామ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు సూర్య నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.









