కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం లైసెన్స్ హక్కుల బహిరంగ వేలం: రికార్డు స్థాయిలో పెరిగిన ఆదాయం

 

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా. అం. ప్ర.

హక్కు భుక్తంలో గల వివిధ లైసెన్స్ హక్కుల కొరకు తేది 01.04.2026 నుండి 31.03.2027 వరకు గల కాలపరిమితికి తేది. 11.02.2026 ఉదయం 11 గంటలకు జరిగిన బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఆన్లైన్ టెండర్ లలో ఈ క్రింది విధముగా హెచ్చు పాటలు వచ్చివున్నవి.
1. తలనీలలు సేకరించుకొను హక్కు :
. గత సంవత్సరం రూ.1,02,6000/- ఉండగా ఈ సారి అనంతపురం కు చెందిన శ్రీ నవీన్ రూ 1,36,50,000/- కు హెచ్చు పాట పాడియున్నారు
2. టోల్గేట్ / పార్కింగ్ రుసుము
. గతంలో రూ 7,10,000/- ఉండగా ఆన్లైన్ నందు రూ 19,07,069/- వచ్చియున్నది.
3. మొబైల్ ఫోన్ భద్రపరచు హక్కు కొరకు
. గతములో రూ 6,20,000/- ఉండగా రూ 8,15,000/- వచ్చియున్నది
4. హుండీ ద్వారా వచ్చిన బియ్యం కొనుగోలు చేయుటకు హక్కు
. గతములో రూ 12,75,000/- సంవత్సరం నకు ఉండగా , ఈసారి కేజీ ఒక్కింటికి రూ 29/- ప్రకారం హెచ్చు పాట వచ్చియున్నది
. 5. దేవాలయ ముందు భాగంలో ఐస్ క్రీమ్స్ అమ్ముకొను హక్కు
. గతంలో రూ 81,000/- ఉండగా సీల్డ్ టెండర్ లో రూ 2,16,000/- హెచ్చుపాట వచ్చియన్నది
6. అగరు బత్తి తయారీ కొరకు
. ఈసారి రూ 6,11,118/- వచ్చియున్నది
7. కేసరి సాధన ముందు భాగంలో తాత్కాలిక షెడ్ తో కాంటీన్ నడుపుటకు
. నెలకు రూ 69,000/- వచ్చియున్నది
8. గోశాల నందు ఎరవు తీసుకొనుటకు
. గతంలో 50,000/- ఉండగా, ఈసారి రూ 57,000/- వచ్చియున్నది
9. ఖాళీ డబ్బాలు తీసుకొని వెళ్ళుటకు
. గతంలో ఒక డబ్బాకు రూ 18/- ఉండగ ఈసారి రూ 19/- వచ్చియున్నది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు , అనంతపురం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె. సుగుణమ్మ గారు , సహాయ కార్యనిర్వహణాధికారి , పర్యవేక్షకులు , కార్యాలయ సిబ్బంది , పోలీస్ వారు , గ్రామస్తులు , టెండర్ పాట దారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు