కాకినాడలో భారీ పేలుడు.. 18 మంది మృతి…

సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో కాసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో అనేమంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్ధం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు