సర్పంచులకు ఇక సెలవు

వచ్చే నెల రెండవ తేదీ నుండి సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వైపు ప్రభుత్వం మోగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జూన్ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయాన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సర్పంచ్ ఎన్నికలు ముందుగా జరిగితే కూటమి పార్టీలు గ్రూపులుగా విడిపోయి పరిషత్ ఎన్నికలలో కూటమి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికలలో కూటమి పార్టీలు సత్తా చాటితే, సర్పంచ్ ఎన్నికల్లో ఈ ప్రభావం పెద్దగా ఉండబోతున్నది పార్టీ పెద్దల అభిప్రాయం. దీంతో పరిషత్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్నటువంటి చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. పరిషత్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు అంటే దాదాపుగా ఈ ఏడాది ఆఖరి దాకా ఆగాల్సిందే. మండల, జిల్లా పరిషత్తుల పదవీకాలం సెప్టెంబర్ లో ముగియ నున్న నందున ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక పరిషత్ ఎన్నికల అన్న అన్న విషయం ప్రభుత్వం తేల్చుకోలేక సంశయం లో పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులలో నూతన సంస్కరణలు తీసుకొచ్చామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామపంచాయతీలో ఇప్పటికే పల్లె పండుగ 2.0 పేరుతో 8000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డులు, ఫైనల్ వేల మినీ గోకులాల నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాలను ప్రాచుర్యం లోకి తీసుకెళ్తే మెజార్టీ గ్రామపంచాయతీలో కూటమి మద్దతు దారులు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని అధికార పార్టీ నేతలు ఉబలాటపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు