బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే టాక్ షోలో తనపై సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్ల గురించి మాట్లాడింది. కొందరు ట్రోలర్లు హద్దులు దాటి మాట్లాడినప్పుడు తాను ఊరుకోనని, స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతానని సరదాగా చెప్పింది. ఈ క్రమంలో, హోస్ట్‌లు చదివిన కొన్ని దారుణమైన కామెంట్లు షోను రోస్టింగ్ సెషన్‌లా మార్చాయి. ఒక యూజర్ ఆమె ఫ్యాషన్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె డ్రెస్ ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా వార్డ్రోబ్ నుంచి తీసుకున్నట్లు ఉందని కామెంట్ చేయగా, దానికి సోనాక్షి “అది కావాలనే వేశా, బ**చ్” అంటూ ఘాటుగా బదులిచ్చి నవ్వులు పూయించింది.
అయితే, ఈ చర్చలో ఒక యూజర్ సోనాక్షిని ‘ఆంటీ’ అని కామెంట్ చేసినందుకు ఆమె అతన్ని బ్లాక్ చేసిందని ట్వింకిల్ ఖన్నా చదవడంతో అసలు మజా మొదలైంది. దీనికి సోనాక్షి గట్టిగా నవ్వుతూనే, “నిన్ను అన్‌బ్లాక్ చేసేది మళ్లీ బ్లాక్ చేయడానికే” అంటూ మాస్ కౌంటర్‌తో బదులిచ్చింది. సోనాక్షి ఇచ్చిన ఈ ఫిల్టర్ లెస్ మరియు హాస్యభరితమైన సమాధానాలు క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెను ‘క్లాప్బ్యాక్ క్వీన్’ (Queen of clapbacks) అంటూ ప్రశంసిస్తూ, సైబర్బుల్లీయింగ్ను ఎదుర్కోవడంలో ఆమె రియాక్షన్ ఒక మాస్టర్‌క్లాస్‌లా ఉందని అభిప్రాయపడ్డారు.
సోనాక్షి సిన్హా ఇచ్చిన ఈ స్మార్ట్ కౌంటర్, ట్రోలర్లు కోరుకునే కోపం బదులుగా, తన ఆత్మవిశ్వాసం, తెలివితో వాళ్ల నోర్లు మూయించింది. ఇది నెగిటివిటీని దూరం చేయడమే కాకుండా, ఇలాంటి వేధింపులు ఎదుర్కొనే ఎంతోమందికి ధైర్యాన్నిచ్చే చర్యగా నిలిచింది. కాగా, సోనాక్షి సిన్హా త్వరలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె ‘ధనపిశాచిని’ అనే మిస్టీరియస్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.









