రైలులో మహిళా ప్రయాణికురాలి ఆగ్రహం: ట్రేతో ఏసీ కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి!

రైలు ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు తన పర్సు చోరీకి గురికావడంతో ఆగ్రహం పట్టలేక ఏకంగా కంపార్ట్‌మెంట్ కిటికీ అద్దాన్ని ట్రేతో కొట్టి పగలగొట్టిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందకపోవడంతో ఆమె నిస్సహాయత, కోపంతో ఈ చర్యకు పాల్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఆందోళనగా ఉన్న ఆ మహిళ కోపంతో ఊగిపోతూ, తోటి ప్రయాణికులు ఆపమని అడుగుతున్నా పట్టించుకోకుండా, పదేపదే ట్రేతో అద్దాల కిటికీని కొడుతున్న దృశ్యం ఉంది. కాసేపటికే కిటికీ పూర్తిగా పగిలిపోయి, అద్దాల ముక్కలు కోచ్ ఫ్లోర్‌పై పడ్డాయి. ఈ విధ్వంసం జరిగినంతసేపు ఆమె పక్కనే చిన్నారి కూర్చుని ఉండటం, కిటికీని పగలగొట్టే క్రమంలో ఆమె తన అరచేతికి గాయం చేసుకోవడం కూడా కనిపించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు యూజర్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేసి, ప్రతి రైలులో మహిళా RPF/GRP సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించాలని డిమాండ్ చేశారు. మరికొందరు, ఆ మహిళ ప్రవర్తన మానసిక ఆరోగ్య సమస్యను సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, పబ్లిక్ న్యూసెన్స్ మరియు పిల్లల భద్రతపై ఆందోళన చెందారు. అయితే, దొంగతనం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది స్పందించకపోవడం వల్లే ఆమె నిగ్రహం కోల్పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు