ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసి రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లను రిలీజ్ చేయడం ద్వారా ఎస్ఆర్‌హెచ్ తన పర్స్‌ను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సు విలువ రూ. 25.5 కోట్లుగా ఉంది.
ఈ పర్స్ విలువతో, SRH వేలంలో గరిష్టంగా 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందులో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఉండొచ్చు. అయితే, SRH ఇప్పటికే తన కోర్ టీమ్‌ను మరియు యువ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది కాబట్టి, వారు కచ్చితంగా 10 మందిని కొనాలనే నిబంధన లేదు (స్క్వాడ్‌లో 18 నుంచి 25 మంది ప్లేయర్లు ఉండొచ్చు). కావ్య మారన్ దృష్టి ప్రధానంగా బౌలింగ్ విభాగంపైనే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే పటిష్టంగా ఉంది.
ముఖ్యంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం స్పిన్నర్ లేమితో ఇబ్బంది పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, కావ్య మారన్ వేలంలో స్టార్ స్పిన్నర్‌లైన రవి బిష్ణోయ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్‌ను తీసుకోగలిగితే, జీషన్ అన్సారీ, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి బౌలర్లతో కలిపి SRH బౌలింగ్ మరింత బలంగా మారుతుంది. అయితే, పేసర్ల విషయంలో బడా ప్లేయర్‌ల కోసం వెళ్లకుండా, మిగిలిన పర్సుతో బ్యాకప్ ప్లేయర్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.









