చిరంజీవి రికార్డును బ్రేక్ చేసిన నాగార్జున: రీ-రిలీజుల్లో ‘శివ’ నెం.1

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం జోరుగా సాగుతున్న ‘రీ-రిలీజ్’ ట్రెండ్‌లో, అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. 1989లో సంచలనం సృష్టించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా, 36 ఏళ్ల తర్వాత 4K ఫార్మాట్‌లో డాల్బీ అట్మాస్‌తో నవంబర్ 14న మళ్లీ విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, రీ-రిలీజుల్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సీనియర్ హీరోగా నాగార్జునను నిలిపింది.

‘శివ’ సినిమా ఫస్ట్ డే రూ.2.5 కోట్లు వసూలు చేయగా, మూడు రోజుల్లోనే రూ.4.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అద్భుతమైన వసూళ్లతో, నాగార్జున మెగాస్టార్ చిరంజీవి రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకుముందు, చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా రీ-రిలీజ్‌లో రూ.3.38 కోట్ల వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన సీనియర్ హీరోగా అగ్రస్థానంలో ఉంది.

ఈ జాబితాలో, చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందర’ (రూ.2.96 కోట్లు), నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ (రూ.1.10 కోట్లు), నాగార్జున ‘మన్మథుడు’ (రూ.80 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా భారతీయ సినిమాలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా, ఈ రీ-రిలీజ్ కలెక్షన్స్ ఆ సినిమాకు ఇప్పటికీ ఉన్న ఆదరణను మరోసారి నిరూపించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు