5.98 లక్షల మంది రైతులకు లబ్ధి: హార్టీకల్చర్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు క్రాప్ వైజ్ క్లస్టర్ విధానాన్ని అనుసరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా, రాయలసీమలో హార్టీకల్చర్‌ను మరింత అభివృద్ధి చేయాలని మంగళవారం నాటి సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, 5.98 లక్షల మంది హార్టీకల్చర్ రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం, రైతులకు సబ్సిడీలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలో, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఆయా జిల్లాల్లో హార్టీకల్చర్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకం కింద రాయలసీమలో హార్టీకల్చర్ అభివృద్ధిపై కూడా సమీక్ష జరిగింది.

ఉద్యానవన రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం సాగు నీటి సౌకర్యాలు, డ్రిప్ ఇరిగేషన్, పంట ఉత్పత్తుల రవాణా, గోడౌన్లు, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే, రైతులు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, టెక్నాలజీ వాడకంపైనా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు