బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చారిత్రక రోజు సందర్భంగా, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ ‘దీక్షా దివస్’కు పిలుపునిచ్చిన వేళ, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. తెలంగాణ కోసం పోరాడిన యోధుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్‌లో ఎక్కడా కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడం అనేక సందేహాలకు దారితీసింది.
కవిత ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్‌ని మెచ్చుకుంటూ కూడా పేరును ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య కేసీఆర్ పట్ల కవితకు ప్రేమ, అనుబంధం ఏమాత్రం లేవని నిరూపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పార్టీని వీడేటప్పుడు తండ్రిపై ప్రేమను ప్రకటించిన కవిత, ఇప్పుడు దీక్షా దివస్ సందర్భంగా ఇలా వ్యవహరించడం ఆమె వ్యూహం ఏమిటనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
నోటితో మెచ్చుకుంటూ, నొసటితో వెక్కిరించే వారి గురించి పండితుడు చెప్పిన సూత్రం కేసీఆర్‌కు వర్తిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కవిత నేరుగా విమర్శించకపోయినా, ఆమె ట్వీట్ తీరు బీఆర్ఎస్ అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ట్వీట్ ద్వారా కవిత కావాలనే బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా లేదా ఆమె అంతరంగంలో ఉన్న నిజాలు బయటపడుతున్నాయా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.









