పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా: కదిరిలో ₹12.28 లక్షల CMRF చెక్కుల పంపిణీ

కదిరిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

ఈరోజు కదిరి నియోజకవర్గ పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆర్ అండ్ బి అతిథి గృహం నందు గౌరవ శ్రీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో సీఎంఆర్ఎఫ్ అమౌంటు చెల్లించిన దాఖలాలు లేవు. వైయస్సార్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఉన్న వాస్తవాలను చూడలేని, చెవులున్న వినలేని మనస్తత్వం గల వ్యక్తి అని పి పి పీ మోడల్ మీద ఆయన కోటి సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని అవన్నీ కేవలం ఫోర్జరీ సంతకాలని ధ్వజమెత్తారు. కదిరి నియోజకవర్గం లో గడిచిన 17 నెలల్లో 273 మందికి 2,69,13099
అందజేయడం జరిగిందని, ఈరోజు 23 మందికి 12,28,362 చెక్కుల రూపేన ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు