హిందూపురంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ

శ్రీ సత్యసాయి జిల్లా

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు హిందూపురం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతగా హిందూపురం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో పార్టీ యువజన విభాగం సభ్యులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం మార్మోగింది.

బైట్స్….. హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపిక.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు