‘రాజా సాబ్’ ప్రోమో టాక్: ప్రభాస్ ఫన్నీ మ్యానరిజమ్స్ ఓకే కానీ.. ట్యూన్ ఏది?

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ చిత్రం నుండి వస్తున్న కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో తడబడుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆశించిన స్థాయిలో క్రేజ్ తీసుకురాలేకపోయాయి. తాజాగా ‘రాజే యువరాజే’ అనే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ తన క్యూట్ మ్యానరిజమ్స్‌తో, ఫన్నీగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పడేయడం కోసం క్రిస్మస్ తాతకు పూజలు చేయడం వంటి విజువల్స్ సరదాగా ఉన్నాయి. అయితే, విజువల్స్ బాగున్నప్పటికీ థమన్ అందించిన ట్యూన్ మాత్రం మళ్ళీ నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాపై అంచనాలు పెరగాలంటే కచ్చితంగా ఒక పవర్ ఫుల్ యాక్షన్ టీజర్ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, తదుపరి ప్రమోషనల్ కంటెంట్ అయినా బలంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటల్లో రెండింటిలో నిధి అగర్వాల్ కనిపించడంతో, ఈ సినిమాలో ఆమే మెయిన్ హీరోయిన్ కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘UA’ సర్టిఫికేట్ పొందింది. సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాల వరకు ఉండటం గమనార్హం.

చిత్ర యూనిట్ త్వరలోనే భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. అమెరికాలో ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవెంట్లను నిర్వహించనున్నారు. తెలుగులో జరిగే ఒక ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్ల ద్వారా అయినా సినిమాపై నెలకొన్న నెగిటివిటీని పోగొట్టి, హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రేపు ఈ ఈవెంట్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభాస్ కామెడీ టైమింగ్, విజువల్ గ్రాండియర్ ఈ సినిమాను గట్టెక్కిస్తాయో లేదో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు