*5 కంట్రీ మేడ్ ఫిస్టోళ్లు, 7 మ్యాగజైన్ లు, 30 లైవ్ బుల్లెట్లు, 3 ఖాళీ బుల్లెట్ షెల్స్, తల్వార్ లు స్వాధీనం… మధ్యప్రదేశ్ గ్యాంగ్ ను అరెస్టు చేసిన అనంత పోలీసులు*
* అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇంకొకరు అనంతపురం వాసి
* మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా–గ్వాలియర్ ప్రాంతాలలో కొనుగోలు చేసి, అనంతపురంలో విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడి*
* టెస్ట్ ఫైర్ సమయంలో గాలిలోకి కాల్పులు జరిపినట్లు పోలీసుల దృష్టికి రావడం… ఆలస్యం లేకుండా ముఠాను పట్టుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ప్రత్యేక పోలీసు బృందం, అనంతపురం టూటౌన్, త్రీటౌన్ & సిసిఎస్ పోలీసులు*
* ఈ ముఠా అరెస్టు, స్వాధీనంలకు సంబంధించిన వివరాలు శుక్రవారం మీడియాకు వెల్లడించిన* *జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
అరెస్ట్ అయిన ముఠా వివరాలు:
1) *రోహిత్ పర్మార్ (24 సం.) – మొరేనా జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం*
2) *శివం సింగ్ పరిహర్ (25 సం.) – మొరేనా జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం*
3) *నల్లి రాజశేఖర్ రెడ్డి (32 సం.) – అనంతపురం నగరం*
** నిందితుడు నం.1 – రోహిత్ పర్మార్
అక్రమ ఆయుధాల కొనుగోలు, నిల్వ మరియు రవాణాలో కీలక పాత్ర
మొరేనా / గ్వాలియర్ ప్రాంతాల నుండి తుపాకులు కొనుగోలు చేసి దాచిపెట్టడం
సంఘటన స్థలంలో తుపాకితో టెస్ట్ ఫైర్ చేయడం
** నిందితుడు నం.2 – శివం సింగ్ పరిహర్
అక్రమ ఆయుధాల సరఫరా మరియు తరలింపులో భాగస్వామ్యం
తుపాకులు, మ్యాగజైన్, బుల్లెట్లను బ్యాగ్‌లో తీసుకువచ్చిన వ్యక్తి
నేరానికి ప్రత్యక్ష సహకారం
** నిందితుడు నం.3 – నల్లి రాజశేఖర్ రెడ్డి
ఆయుధాలను అనంతపురంలో అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతో మిగితా ఇద్దరు నిందితులకు సహకరించాడు
*5 కంట్రీ మేడ్ ఫిస్టోళ్లు
2 మ్యాగజైన్ లు
30 లైవ్ బుల్లెట్లు
3 ఖాళీ బుల్లెట్ షెల్స్*
01 తల్వార్
** *ఈ ఘటనపై అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*
జిమ్ నిర్వాహకుడు నల్లి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా గన్ కల్గిఉండి … గన్ తో హల్ చల్ చేయడంపై అనంతపురం 2 పట్టణ పోలీసు స్టేషన్లో ఈనెల 12 వ తేదీన *Cr.No.262/2025 U/s 25(1B)(a), 25(1B)(b) – Arms Act* కింద కేసు నమోదు చేశారు.
** *జిమ్ నిర్వాహకుడితో గన్ దొరకడాన్ని తీవ్రంగా పరిగణింపు… లోతుగా విచారణ*
అనంతపురంలో జిమ్ నిర్వహకుడు వద్ద గన్ దొరికడాన్ని *జిల్లా ఎస్పీ శ్రీ. పి. జగదీష్, IPS గారు* తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఛేదించాలని ఆదేశించారు. దీంతో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాస రావు అద్వర్యంలో అనంతపురము 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.శ్రీకాంత్ , అనంతపురము 3 టౌన్ పోలీస్ స్టేషన్ CI రాజేంద్ర నాథ్ యాదవ్, CCS CI శేషగిరి, బొమ్మనహల్ SI. S.నబీ రసూల్ అనంతపురము 2 టౌన్ పిఎస్ SI C. ఋషేంద్ర బాబు, CCS సిబ్బంది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక పోలీసు బృందంతో కలసి నిన్న సాయంత్రం పక్కా రాబడిన సమాచారంతో స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీప ప్రాంతంలో ముగ్గురు నిందితులను పోలీసు బృందాలు అరెస్టు చేశారు.
*అక్రమ ఆయుధాల సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ గారు పేర్కొన్నారు.*
** *ముఠా నేపథ్యం* :
ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులు పరస్పర పరిచయాలతో కూడిన అక్రమ ఆయుధాల సరఫరా ముఠాగా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహర్ లు గత కొన్ని సంవత్సరాలుగా గ్వాలియర్–మొరేనా ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు కంట్రీ మేడ్ గన్స్ మరియు బుల్లెట్స్‌ను కొనుగోలు చేసి, వాటిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
అనంతపురంకు చెందిన నల్లి రాజశేఖర్ రెడ్డి స్థానికంగా జిమ్ నిర్వహిస్తున్నాడు. ఇతను 3 సంలు క్రితం పంజాబ్ లోని జలంధర్ లో జిమ్ పరికరాలు కొనడానికి వెళ్లినప్పుడు రోహిత్ పర్మార్, శివం సింగ్ పరిహర్ @దీరజ్ లతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో జిమ్ కు వచ్చే వాళ్ళలో ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని బెదిరించడానికి గన్ అవసరమని భావించిన నల్లి రాజశేఖర్ రెడ్డి మిగితా ఇద్దరు నిందితులైన రోహిత్ పర్మార్, శివం సింగ్ పరిహర్ @దీరజ్ లతో కలిసి గన్ కొనుగోలు చేశాడు. నల్లి రాజశేఖర్ రెడ్డి ఆ గన్ ను తన వద్ద అక్రమంగా పెట్టుకున్న విషయం లో అనంతపురము 2 టౌన్ పోలీసు స్టేషన్ లో 12.12.2025 వ తేదీ కేసు నమోదు చేశారు. స్థానిక పరిచయాలు, వ్యాపార సంబంధాలను ఉపయోగించుకొని ఆయుధాల విక్రయానికి మిగితా నిందితులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది.
** *ఒక్కో గన్ పై రూ. 20 నుండీ 30 వేలు అక్రమ ఆదాయం వస్తుందనే దురాశ* …
నిందితుల విచారణలో వెల్లడించిన విషయాలలో భాగంగా…ఒక్కో కంట్రీ మేడ్ గన్‌ను మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సుమారు రూ.40,000 నుండి రూ.50,000 వరకు కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తే ఒక్కో గన్‌పై రూ.20,000 నుండి రూ.30,000 వరకు అక్రమ లాభం పొందే అవకాశం ఉన్నట్లు వారు భావించారు. ఇదే ఆశతో ఎక్కువ సంఖ్యలో గన్స్‌ను తెప్పించి విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే ముగ్గురు పోలీసులకు చిక్కారు.
** *ప్రశంస* :
5 కంట్రిమేడ్ ఫిస్టోళ్లు, 30 బుల్లెట్స్, 3 ఖాళీ బుల్లెట్ షెల్స్ , 07 మ్యాగ్జైన్లు, తల్వార్ లను స్వాధీనపరుచుకోవడంలో విశేష కనపరిచిన కనబరిచిన పోలీసు అధికారులను మరియు పోలీసు బృందాలను *జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు* ప్రత్యేకంగా అభినందించారు. అనంతపురము అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాస రావు మరియు అనంతపురము 2 టౌన్ & 3 టౌన్ సి.ఐ లు శ్రీకాంత్ , రాజేంద్రనాథ్ యాదవ్, CCS CI శేషగిరి, బొమ్మనహల్ SI. S.నబీ రసూల్ అనంతపురము 2 టౌన్ పిఎస్ SI C. ఋషేంద్ర బాబు, అనంతపురము 2 టౌన్ PS సిబ్బంది ASI అమరేశ్వర్, కానిస్టేబుళ్ళు వన్నూరప్ప, అంజన కుమార్, సుధాకర్, పాండవ, మరియు CCS సిబ్బంది ఉన్నారు.
** *జిల్లా ఎస్పీ గారి హెచ్చరిక* :
జన సంచార ప్రదేశాల్లో అక్రమ ఆయుధాల కలిగి ఉండటం మరియు వినియోగించడం తీవ్రమైన నేరమని… ఇటువంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని, నేరస్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని *జిల్లా ఎస్పీ గారు* హెచ్చరించారు. అక్రమంగా తుపాకులు విక్రయించటం వల్ల నేరాలు పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని, ఇటువంటి ముఠాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అక్రమ ఆయుధాల సరఫరా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
Post Views: 23









