* అక్రమ మట్టి తరలింపు ఆపాలంటూ కొత్తపల్లి గ్రామస్తుల ఆవేదన…
* చెరువులను మింగేస్తున్న కూటమి నాయకులు..
* అక్రమంగా మట్టి తరలిస్తున్న కూటమి నాయకులు.. పట్టించుకోని అధికారులు..
* శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం- సోమందేపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్న ఉషశ్రీ చరణ్..
* నేడు మాగేచెరువు పంచాయితీ కొత్తపల్లి గ్రామస్తులతో కలిసి అక్రమంగా తవ్వకాలు చేపట్టిన కొత్తపల్లి చెరువును మొత్తం పర్యవేక్షించి, చెరువులో అక్రమ తవ్వకాలు చేపట్టిన టిడిపి గుండాలను వెంటనే అరెస్టు చేయాలని చెరువులో ధర్నా నిర్వహించి MRO ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి MRO గారికి వినతి పత్రం అందజేసి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న కూటమి నాయకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు..
* ఈ కార్యక్రమంలో భాగంగా ఉషాశ్రీ చరణ్ గారు మాట్లాడుతూ..
* పెనుకొండ నియోజకవర్గం లో తన సంపద సృష్టిలో భాగంగా ఎక్కడ చూసినా ఏ చెరువు చూసిన, ఏ కొండ చూసిన, ఏ కుంట చూసిన మట్టిని అక్రమంగా తరలించడమే సవితమ్మ పనిగా పెట్టుకుంది..
* కొత్తపల్లి గ్రామంలో అయితే స్మశాన వాటికకు వెళ్లే దారిని కూడా తన సంపద కోసం చెరువులో ఉన్న దారిని కూడా అక్రమంగా తవ్వేశారు..
* ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు..
* మా చెరువులో అక్రమ మట్టి ఎందుకు తోలుతున్నారని గ్రామస్తులు వెళితే గ్రామస్తుల పైన అక్రమ కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు..
* ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ రేట్ ముట్టడిస్తామని ఉష శ్రీ చరణ్ అన్నారు..









